ఉరి జాప్యంతో తప్పుడు సంకేతాలు

         నిర్భయ దోషులను ఉరి తీయకపోవడంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషుల ఉరితీత అమలు వారెంట్ల విషయంలో జరుగుతున్న జాప్యంతో సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను ఉరి తీసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని అషాదేవి స్పష్టం చేశారు.          ఇదే అంశంపై నిర్భయ తండ్రి బద్రీనాథ్ సైతం విచారం వ్యక్తం చేశారు. దోషుల తరఫు […]

Update: 2020-02-07 05:43 GMT

నిర్భయ దోషులను ఉరి తీయకపోవడంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషుల ఉరితీత అమలు వారెంట్ల విషయంలో జరుగుతున్న జాప్యంతో సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను ఉరి తీసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని అషాదేవి స్పష్టం చేశారు.

ఇదే అంశంపై నిర్భయ తండ్రి బద్రీనాథ్ సైతం విచారం వ్యక్తం చేశారు. దోషుల తరఫు లాయరు సిగ్గుపడాలి… పదేపదే రాష్ట్రపతి ఆదేశాలను పరిహాసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉరితీత అమలుకు కొత్త తేదీని ఖరారు చేయాలని జైలు అధికారులు సీఆర్‌పీసీలోని సెక్షన్ 413, 414 కింది పాటియాల కోర్టును అశ్రయించారు.

Tags:    

Similar News