దేశ సేవ చేసేందుకు ముందుకు రావాలి : ఏఎస్పీ యోగేష్

దిశ, కురవి: పాకిస్తాన్‌‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా భారత సైనికులు సైకిల్ యాత్ర చేపట్టారు. మంగళవారం ఈ యాత్ర బృందం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చేరుకుంది. వారికి టీఆర్ఎస్ యువ నాయకులు రవిచంద్ర నాయక్ స్వాగతం పలికారు. అనంతరం కోచ్ సింధు వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్మీ అధికారి, కల్నన్ శ్రీనివాస రావు, జిల్లా ఏఎస్పీ యోగేష్ గౌతం పాల్గొని మాట్లాడుతూ.. […]

Update: 2021-09-28 05:26 GMT

దిశ, కురవి: పాకిస్తాన్‌‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా భారత సైనికులు సైకిల్ యాత్ర చేపట్టారు. మంగళవారం ఈ యాత్ర బృందం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చేరుకుంది. వారికి టీఆర్ఎస్ యువ నాయకులు రవిచంద్ర నాయక్ స్వాగతం పలికారు. అనంతరం కోచ్ సింధు వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్మీ అధికారి, కల్నన్ శ్రీనివాస రావు, జిల్లా ఏఎస్పీ యోగేష్ గౌతం పాల్గొని మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక యువత అని తెలిపారు. యువత శారీరకంగా, మానసికంగా ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

దేశ సేవ చేసేందుకు యువత ముందుకు రావాలని ఏఎస్పీ యోగేష్ సూచించారు. అనంతరం కల్నన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2018లో ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు ఉపయోగకరంగా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అనంతరం సైన్యంలో చేరడానికి యువత భారీ సంఖ్యలో ఉత్సాహం చూపించారని, అందులో 40 మంది ఉద్యోగం సాధించారని అన్నారు. ఈ సమావేశంలో భారత సైన్యాధికారి, కల్నన్ లక్ష్మణ్ సింగ్, ఎంపీడీవో ధన్‌సింగ్ నాయక్, ఆలయ చైర్మన్ రాము నాయక్, టీఆర్ఎస్‌వీ నాయకులు రవి నాయక్, స్థానిక నాయకులు నరసింహ రావు, ఎంపీటీసీ భాస్కర్, ఆర్మీ సైకిల్ యాత్ర బృందం, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tags:    

Similar News