కరోనాపై అవగాహన కల్పించాలి
దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ గురించి ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్మూర్ ఎమ్మల్యే జీవన్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సోమవారం వీడియోకాల్ ద్వారా సంభాషించారు. జడ్పీటీసీ, సర్పంచులు, రైతు బంధు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రజలకు బియ్యం త్వరగా పంపిణీ చేసేలా చూడాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు గృహ నిర్బంధంలో ఉంచేలా సర్పంచు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు […]
దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ గురించి ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్మూర్ ఎమ్మల్యే జీవన్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సోమవారం వీడియోకాల్ ద్వారా సంభాషించారు. జడ్పీటీసీ, సర్పంచులు, రైతు బంధు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రజలకు బియ్యం త్వరగా పంపిణీ చేసేలా చూడాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు గృహ నిర్బంధంలో ఉంచేలా సర్పంచు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామంలోని యచకులకు రెండు పూటలా అన్నం పెట్టించాలని అన్నారు. సామూహిక దూరం ఆవశ్యకతను చెప్పేలా చాటింపు చేయించాలన్నారు.
tags: Armoor Mla Jeevan reddy,video calling, coronavirus