రెహమాన్‌కు అరుదైన గౌరవం..
దిశ, వెబ్‌డెస్క్ : ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా నియమించబడ్డారు. బాఫ్టా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా భారత్‌లోని గొప్ప గొప్ప కళాకారులను గుర్తించడమే అంబాసిడర్‌గా తన బాధ్యత కాగా.. వంద శాతం న్యాయం చేస్తానని తెలిపాడు రెహమాన్. టెలివిజన్, సినిమా, స్పోర్ట్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ టాలెంటెడ్ పీపుల్స్‌ను గుర్తించి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెడతానన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా నియమించబడ్డారు. బాఫ్టా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా భారత్‌లోని గొప్ప గొప్ప కళాకారులను గుర్తించడమే అంబాసిడర్‌గా తన బాధ్యత కాగా.. వంద శాతం న్యాయం చేస్తానని తెలిపాడు రెహమాన్. టెలివిజన్, సినిమా, స్పోర్ట్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ టాలెంటెడ్ పీపుల్స్‌ను గుర్తించి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెడతానన్నారు. ఈ అవకాశాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన రెహమాన్.. వరల్డ్ వైడ్‌గా టాలెంటెడ్ ఆర్టిస్టులను గుర్తించడంతో పాటు వారి మధ్య సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న బాఫ్టాకు థాంక్స్ చెప్పారు.
కాగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలతోనూ అనుబంధం ఉన్న రెహమాన్‌ను అంబాసిడర్‌గా నియమించడాన్ని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రి స్వాగతించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలతో తనకున్న రిలేషన్ బాఫ్టాకు చాలా ఉపయోగపడుతుందన్నారు. బ్రేక్ త్రూ ఇండియన్ ఆర్టిస్టులను ఎంపిక చేసేందుకు జ్యూరీ మెంబర్స్, జడ్జ్‌లను నియమించాల్సి ఉందన్నారు.