ప్రయాణీకులకు APSRTC శుభవార్త
దిశ, ఏపీబ్యూరో: కరోనా వైరస్ కట్టడికి గత మార్చి 22 నుంచి కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో వివిధ ప్రయాణాలకు ముందుగా డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. గతంలో అలా టికెట్లు రిజర్వ్ చేసుకున్నవారంతా క్యాన్సిల్ చేసుకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ సమయంలో టికెట్ రద్దు చేసుకోలేని వారికి మరోసారి ఏపీఎస్ఆర్టీసీ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించినట్టు వెల్లడించింది. […]
దిశ, ఏపీబ్యూరో: కరోనా వైరస్ కట్టడికి గత మార్చి 22 నుంచి కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో వివిధ ప్రయాణాలకు ముందుగా డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. గతంలో అలా టికెట్లు రిజర్వ్ చేసుకున్నవారంతా క్యాన్సిల్ చేసుకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ సమయంలో టికెట్ రద్దు చేసుకోలేని వారికి మరోసారి ఏపీఎస్ఆర్టీసీ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించినట్టు వెల్లడించింది. టికెట్లకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్ చేసుకున్న వారెవరైనా ఈనెల 29లోపు టికెట్లను రద్దు చేసుకుని నగదు పొందొచ్చని తెలిపింది. తమకు దగ్గర్లోని బస్టాండ్ లేదా ఏటీబీ కౌంటర్‌లో టికెట్ చూపించి నగదు పొందొచ్చని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు స్పష్టంచేసింది.