వృద్ధులకు గుడ్‌న్యూస్.. ఆసరా పెన్షన్‌ దరఖాస్తులకు మరో అవకాశం

దిశ, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య ఆసరా పెన్షన్ వయసును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు కుదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని నాగర్‌ కర్నూల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం ప్రకటనలో తెలిపారు. 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నిరుపేదలు ఆగస్టు 31 లోగా ఈ-సేవా లేదా మీ సేవ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రము కానీ, […]

Update: 2021-08-14 07:16 GMT

దిశ, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య ఆసరా పెన్షన్ వయసును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు కుదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని నాగర్‌ కర్నూల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం ప్రకటనలో తెలిపారు. 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నిరుపేదలు ఆగస్టు 31 లోగా ఈ-సేవా లేదా మీ సేవ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రము కానీ, బొనఫైడ్, పదవ తరగతి ఉత్తీర్ణత పత్రము, ఓటర్ గురింపు కార్డు ఆధారంగా వయసును నిర్ధారిస్తారని తెలియజేశారు. అందుకే, జిల్లాలోని అర్హులైన నిరుపేదలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News