భారత్‌లో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనున్న యాపిల్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ త్వరలో తన రిటైల్ స్టోర్లను భారత్‌లో ప్రారంభించనుంది. ఇప్పటివరకు థర్డ్ పార్టీ రిటైల్ ఔట్‌లెట్లపై ఆధారపడిన యాపిల్ మరికొద్ది రోజుల్లో సొంతంగానే స్టోర్లనే ప్రారంభించడానికి సిద్ధమైంది. గతేడాది ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత కస్టమర్ల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే యాపిల్ త్రైమాసిక వ్యాపారం రెట్టింపు స్థాయిలో నమోదవడంతో తాజా నిర్ణయం తీసుకుంది. ‘భారత్‌లో వ్యాపారం వృద్ధి చెందుతోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో […]

Update: 2021-01-28 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ త్వరలో తన రిటైల్ స్టోర్లను భారత్‌లో ప్రారంభించనుంది. ఇప్పటివరకు థర్డ్ పార్టీ రిటైల్ ఔట్‌లెట్లపై ఆధారపడిన యాపిల్ మరికొద్ది రోజుల్లో సొంతంగానే స్టోర్లనే ప్రారంభించడానికి సిద్ధమైంది. గతేడాది ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత కస్టమర్ల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే యాపిల్ త్రైమాసిక వ్యాపారం రెట్టింపు స్థాయిలో నమోదవడంతో తాజా నిర్ణయం తీసుకుంది. ‘భారత్‌లో వ్యాపారం వృద్ధి చెందుతోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్నట్టు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.

రిటైల్ స్టోర్‌తో పాటు యాపిల్ తన ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్ ఇతర ఉత్పత్తుల తయారీని కూడా మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో భారత్‌లో తన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్, ఐఫోన్ 12 సిరీస్ తయారీని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మధ్యలో యాపిల్ తన ఐప్యాడ్ ఉత్పత్తిని వియత్నాంలో ప్రారంభించే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఐఫోన్ 12 సిరీస్ మోడళ్లను భారత్‌లో ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యాపిల్ తన ఉత్పత్తుల తయారీని వ్యూహాత్మకంగానే చైనా వెలుపల మారుస్తున్నట్టు తెలుస్తోంది. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది మధ్య నాటికి విడుదల అవనున్నట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News