స్థలం లీజుకు తీసుకున్న యాపిల్

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో తన మొట్టమొదటి దుకాణాన్ని ప్రారంభించడానికి ముందు, యాపిల్ సంస్థ బెంగళూరులో వాణిజ్య కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు వెల్లడించింది. 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని సంస్థ ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది. ప్రెస్టీజ్ ఎస్టేట్‌కు చెందిన ఈ స్థలానికి యాపిల్ సంస్థ ఏడాదికి రూ. 82 కోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. యాపిల్ సంస్థ భారత్‌లో తన ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ఒప్పందం జరిగింది. వచ్చే ఏడాదికి యాపిల్ […]

Update: 2020-10-04 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో తన మొట్టమొదటి దుకాణాన్ని ప్రారంభించడానికి ముందు, యాపిల్ సంస్థ బెంగళూరులో వాణిజ్య కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు వెల్లడించింది. 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని సంస్థ ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది. ప్రెస్టీజ్ ఎస్టేట్‌కు చెందిన ఈ స్థలానికి యాపిల్ సంస్థ ఏడాదికి రూ. 82 కోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. యాపిల్ సంస్థ భారత్‌లో తన ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ఒప్పందం జరిగింది.

వచ్చే ఏడాదికి యాపిల్ సంస్థ ముంబైలో తొలి దుకాణాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా బెంగళూరులో తీసుకున్న స్థలంలో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసి 4000 మందికి ఉపాధి కల్పించనుంది. కాగా, యాపిల్ సంస్థ భారత్‌లో గత 20 ఏళ్లుగా తన ఉత్పత్తులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ సంస్థల ద్వారా విక్రయాలు జరుపుతోంది.

అయితే, ఇటీవల భారత్‌లోనూ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇటీవల ఐఫోన్ 11, కొత్త ఐఫోన్ ఎస్ఈల అసెంబ్లింగ్‌ను భారత్‌లోనే ప్రారంభించింది. ‘భారత్‌లో విస్తరిస్తున్నందుకు గర్వంగా ఉంది. తమ కస్టమర్లకు నేరుగా సేవలందించేందుకు అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తామని.. అలాగే, ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వార తమ వినియోగదారులకు యాపిల్ ఉత్తమమైన సేవలనందిస్తున్నామని ఇటీవల ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన సమయంలో యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డియెర్‌డ్రే ఓ బ్రయాన్ చెప్పారు.

Tags:    

Similar News