ఇకపై ఆన్లైన్‌లో అపోలో టైర్స్ విక్రయం..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టైర్ల సంస్థ అపోలో టైర్స్ ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. భారత్‌లోని వినియోగదారులకు అవసరమైన కారు, ద్విచక్ర వాహనాల టైర్లను చేసేందుకు వీలుగా ‘బై ఆన్‌లైన్-ఫిట్ ఆఫ్‌లైన్’ పేరుతో ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఇకమీదట ఆన్‌లైన్ ద్వారానే కస్టమర్లు తమ వాహనాలకు కావాల్సిన అపోలో టైర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే, వాహనానికి తగిన టైర్లను, సర్వీసులను పొందడానికి దగ్గరలో ఉన్న అపోలో డీలర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టైర్ల సంస్థ అపోలో టైర్స్ ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. భారత్‌లోని వినియోగదారులకు అవసరమైన కారు, ద్విచక్ర వాహనాల టైర్లను చేసేందుకు వీలుగా ‘బై ఆన్‌లైన్-ఫిట్ ఆఫ్‌లైన్’ పేరుతో ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపింది.
ఇకమీదట ఆన్‌లైన్ ద్వారానే కస్టమర్లు తమ వాహనాలకు కావాల్సిన అపోలో టైర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే, వాహనానికి తగిన టైర్లను, సర్వీసులను పొందడానికి దగ్గరలో ఉన్న అపోలో డీలర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. బుకింగ్ సమయాన్ని బట్టి డీలర్ ప్రదేశానికి చేరుకుంటే వాహణ టైర్లను మార్చుకోవచ్చని, ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ పోర్టల్ దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.