ఏపీకే ప్యూర్ యాప్ స్టోర్‌తో మాల్‌వేర్ అటాక్!
దిశ, ఫీచర్స్: సైబర్ క్రిమినల్స్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో ఎవరికీ తెలియదు. పాపులర్ యాప్స్ లక్ష్యంగా ‘ఫేక్ యాప్స్’ క్రియేట్ చేస్తుంటారు. ఇటీవలే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, క్లబ్ హౌస్ విషయంలోనూ ఇలానే జరిగిన విషయం తెలిసిందే. అందుకే యాప్స్ డౌన్‌లోడ్‌కు ‘గూగుల్ ప్లే స్టోర్’ను మాత్రమే ఉపయోగించాలని గూగుల్ సూచిస్తున్నప్పటికీ, సాంకేతికంగా వినియోగదారులు మాత్రం వారి యాప్ అవసరాల నిమిత్తం ఇతర వనరులను ఉపయోగిస్తున్నారు. ఎన్ని సైబర్ క్రైమ్స్ జరిగినా, సైబర్ సెక్యూరిటీ టీమ్స్ హెచ్చిరించినా […]
దిశ, ఫీచర్స్: సైబర్ క్రిమినల్స్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో ఎవరికీ తెలియదు. పాపులర్ యాప్స్ లక్ష్యంగా ‘ఫేక్ యాప్స్’ క్రియేట్ చేస్తుంటారు. ఇటీవలే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, క్లబ్ హౌస్ విషయంలోనూ ఇలానే జరిగిన విషయం తెలిసిందే. అందుకే యాప్స్ డౌన్‌లోడ్‌కు ‘గూగుల్ ప్లే స్టోర్’ను మాత్రమే ఉపయోగించాలని గూగుల్ సూచిస్తున్నప్పటికీ, సాంకేతికంగా వినియోగదారులు మాత్రం వారి యాప్ అవసరాల నిమిత్తం ఇతర వనరులను ఉపయోగిస్తున్నారు. ఎన్ని సైబర్ క్రైమ్స్ జరిగినా, సైబర్ సెక్యూరిటీ టీమ్స్ హెచ్చిరించినా సరే.. యూజర్లలో మార్పు లేకపోగా, దీన్ని పూర్తిగా నిరోధించడం సాధ్యం కావడం లేదు. పైగా గూగుల్ ప్లే స్టోర్స్‌లోనూ ఫేక్ యాప్స్ దర్శనమిస్తున్నాయి. కానీ ఇతర థర్డ్ పార్టీ యాప్స్‌తో పోలిస్తే.. వాటిని వెంటనే గుర్తించి తీసివేయడంతో పాటు యూజర్లను హెచ్చరించడం సానుకూలాంశం. ఈ నేపథ్యంలోనే అన్ అఫీషియల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఏపీకే ప్యూర్ (APKPure) స్టోర్ ప్రమాదకర మాల్‌వేర్ కలిగి ఉందని, అది ట్రోజన్స్ ఇన్‌స్టాల్ చేస్తుందని, యూజర్లు జాగ్రత్త వహించాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పరెస్కీ తాజాగా హెచ్చరించింది.
ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచిత షేర్‌వేర్ యాప్‌లు అందించే ఏపీకే మిర్రర్ (APK mirror), ఎఫ్- డ్రాయిడ్(F-Droid) వంటి వాటితో పాటు ఏపీకే ప్యూర్ ప్రాచుర్యం పొందిన ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి. ఇది సహజంగా గూగుల్ స్టోర్‌లో అందుబాటులో లేకపోగా, డివైజ్‌లో మాల్‌వేర్ ఎంట్రీకి ఈ యాప్ గేట్‌వేగా మారింది. ఇందులో అనేక ట్రోజన్స్ ఉన్నట్లు టెక్ నిపుణులు గుర్తించారు. ఈ ట్రోజన్ మొబైల్‌లోకి ప్రవేశిస్తే మొబైల్ స్క్రీన్‌పై తరచూ యాడ్‌లతో పాటు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ షో చేస్తుంది. అంతేకాదు యూజర్ డేటాను దొంగిలించి ప్రమాదకరమైన మాల్‌వేర్స్‌ను ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వెర్షన్ 3.17.18 ఉపయోగిస్తుంటే, దాన్ని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి యాంటీమాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మీ ఫోన్‌ను స్కాన్ చేయండి. ఇలా చేయడంతో థర్డ్ పార్టీ యాప్‌ల వాడకాన్ని పున: పరిశీలించడంతో పాటు ఏపీకే ప్యూర్ కలిగించే నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటుందని కాస్పరెస్కీ చెబుతోంది.