అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టొద్దు
దిశ, న్యూస్‌బ్యూరో: అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టు నిర్మించవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును కోరినట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. తమకు కేటాయించిన 512 టీఎంసీల నుంచే తీసుకుంటామని ఏపీ చెప్తున్నా ఎలాంటి పర్యవేక్షణ లేదని, 512 టీఎంసీలు కూడా తాత్కాలిక కేటాయింపులేనని ఆయన అన్నారు. బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావుతో కలిసి […]
దిశ, న్యూస్‌బ్యూరో: అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టు నిర్మించవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును కోరినట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. తమకు కేటాయించిన 512 టీఎంసీల నుంచే తీసుకుంటామని ఏపీ చెప్తున్నా ఎలాంటి పర్యవేక్షణ లేదని, 512 టీఎంసీలు కూడా తాత్కాలిక కేటాయింపులేనని ఆయన అన్నారు. బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావుతో కలిసి కృష్ణా బోర్డు చైర్మన్‌ను కలిసి ఏపీ జారీ చేసిన జీవో 202పై ఆయన ఫిర్యాదు చేశారు. ఏపీ నిర్ణయంతో తెలంగాణలో దారుణ స్థితి ఏర్పడుతుందని హైదరాబాద్ తాగునీటికే కష్టమవుతుందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రైబ్యునల్‌లో ఇప్పటికే పోరాడుతున్నమని, మిగులు జలాల పూర్తి లెక్కలు తేలిన తర్వాతే వాటాలు నిర్ణయించాలని రజత్‌కుమార్ కోరారు.