జగన్‌ను ఢీకొట్టే వ్యూహరచన.. పవన్ నేతృత్వంలో ఫ్రంట్?

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాలు వార్ వన్‌సైడ్‌గా మారిపోయాయి. వైసీపీ దెబ్బకు అన్ని పార్టీలు కుదేలయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో మిగిలిన పార్టీలు కొట్టుకుపోయాయి. దీంతో 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇతర పార్టీలు సహకరించడం లేదు. దీంతో విపక్షాలు అన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నాయి. చివరికి చంద్రబాబు సైతం పవన్ కల్యాణ్ వైపే చూస్తున్నట్లు […]

Update: 2021-06-16 04:54 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాలు వార్ వన్‌సైడ్‌గా మారిపోయాయి. వైసీపీ దెబ్బకు అన్ని పార్టీలు కుదేలయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో మిగిలిన పార్టీలు కొట్టుకుపోయాయి. దీంతో 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇతర పార్టీలు సహకరించడం లేదు. దీంతో విపక్షాలు అన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నాయి. చివరికి చంద్రబాబు సైతం పవన్ కల్యాణ్ వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లోని కూటమి మరోసారి ఏర్పడితే గానీ వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనలేమని చంద్రబాబుతోపాటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేయడం వల్లే వైసీపీకి కలిసొచ్చిందని పలువురు అభిప్రాయపడుతుున్నారు. ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిస్తే గానీ వైసీపీని ఓడించలేమని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో కలిసి పనిచేసేందుకు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి బీజేపీ పనిచేస్తామంటుంది. ఈ నేపథ్యంలో పవన్ నేతృత్వంలో విపక్షాలన్నీ ఒక్కటైతేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణ్ అని ఇప్పటికే ప్రకటించింది. అలాంటప్పుడు చంద్రబాబు పవన్ కల్యాణ్‌తో చేతులు కలుపుతారా? అన్న చర్చ జరుగుతుంది. చేతులు కలిపితే చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్తారా అన్న అనుమానం కూడా కలుగుతుంది.

ఒకవేళ జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారం అవసరం. మరి సహకరిస్తుందా లేక సహాయనిరాకరణ చేస్తుందా అనేది అప్పటి రాజకీయ పరిణామాలను బట్టి గానీ చెప్పలేం. వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దాంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ చంద్రబాబుకు తప్పక సహకరించాల్సిన పరిస్థితి అని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి భవిష్యత్‌లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News