ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ ?

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు గురువారం ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. బుధవారం ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో కొత్త ఎస్ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 1న ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 8న ఎన్నికలు నిర్వహించాలని.. 10న ఫలితాలు […]

Update: 2021-03-31 05:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు గురువారం ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. బుధవారం ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో కొత్త ఎస్ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 1న ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఏప్రిల్ 8న ఎన్నికలు నిర్వహించాలని.. 10న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వేగవంతంగా నిర్వహించాలనా ప్రయత్నిస్తోంది. న్యాయస్థానాలను సైతం ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే తాజాగా కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఆమె ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సీఎం వైఎస్ జగన్‌తో ఆమె భేటీన సందర్భంలోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News