పింఛన్ సొమ్ముతో వాలంటీర్ పరార్
దిశ, ఏపీ బ్యూరో: వృద్ధులు, వికలాంగులకు పంచాల్సిన పింఛన్ సొమ్ముతో గ్రామ వాలంటీర్ ఉడాయించిన సంఘటన అనంతపురం జిల్లాలోని పెనుకొండ మడలంలోని కొండంపల్లిలో చోటుచేసుకుంది. కొండంపల్లి గ్రామానికి చెందిన హనుమంతునాయక్ గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ప్రతినెలా మాదిరే సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ హీరా నుంచి 49 పింఛన్లకుగాను 63,500 రూపాయలు వాలంటీర్ అందుకున్నారు. సరిగ్గా పింఛన్ పంచాల్సిన సమయానికి కనిపించకుండా పోయాడు. దీంతో సాయంత్రం వరకు చూసిన పింఛన్ దారులు సచివాలయ ఉద్యోగులకు ఫిర్యాదు చేశారు. […]
దిశ, ఏపీ బ్యూరో: వృద్ధులు, వికలాంగులకు పంచాల్సిన పింఛన్ సొమ్ముతో గ్రామ వాలంటీర్ ఉడాయించిన సంఘటన అనంతపురం జిల్లాలోని పెనుకొండ మడలంలోని కొండంపల్లిలో చోటుచేసుకుంది. కొండంపల్లి గ్రామానికి చెందిన హనుమంతునాయక్ గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ప్రతినెలా మాదిరే సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ హీరా నుంచి 49 పింఛన్లకుగాను 63,500 రూపాయలు వాలంటీర్ అందుకున్నారు. సరిగ్గా పింఛన్ పంచాల్సిన సమయానికి కనిపించకుండా పోయాడు. దీంతో సాయంత్రం వరకు చూసిన పింఛన్ దారులు సచివాలయ ఉద్యోగులకు ఫిర్యాదు చేశారు. నిత్యం పేకాటలో మునిగితేలే హనుమంతునాయక్ తిరిగే ప్రదేశాలన్నీ గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి గంగరత్నమ్మ, వెల్ఫేర్ ఆఫీసర్ హీరా గ్రామంలో విచారించి గ్రామ వాలంటీర్ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు.