నాలుగు జోన్లుగా ఏపీ పరిపాలన? : సీఎం జగన్
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పాలన వికేంద్రీకరణపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై సోమవారం మంత్రులు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఒకవేళ ఏపీని నాలుగు జోన్లుగా విభజిస్తే వాటికి చైర్మన్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉంది. రాజధాని తరలింపునకు ముందుగానే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు కానున్నాయి. జోనల్ కేంద్రాలుగా విజయనగరం, కాకినాడ, […]
దిశ, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పాలన వికేంద్రీకరణపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ అంశంపై సోమవారం మంత్రులు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఒకవేళ ఏపీని నాలుగు జోన్లుగా విభజిస్తే వాటికి చైర్మన్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉంది. రాజధాని తరలింపునకు ముందుగానే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు కానున్నాయి.
జోనల్ కేంద్రాలుగా విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప ఉండనున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అధికార వర్గాల సమాచారం.