రేపటి బంద్‌కి సంపూర్ణ మద్దతు: తులసిరెడ్డి
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న జరగనున్న రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా తమ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మడాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న […]
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న జరగనున్న రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా తమ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మడాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
త్వరలోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తమ పార్టీ నేత రాహుల్ గాంధీ విశాఖలో పర్యటించబోతున్నట్లు తెలిపారు. ఏపి పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఇందిరా హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మోదీ హయాంలో దాన్ని అమ్మేస్తున్నారంటూ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. విభజన హామీలను సైతం నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేని ఆరోపించారు. రైల్వే జోన్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభించనే లేదని తులసిరెడ్డి పెదవి విరిచారు.