యూట్యూబ్‌లో సుమ.. అదరగొట్టు సుమీ!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఇష్టమైన యాంకర్ సుమ. మలయాళీ అయినప్పటికీ అచ్చుతప్పులు లేకుండా స్పష్టంగా తెలుగు ఉచ్ఛరిస్తూ, తన మాటల తూటాలతో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంలో సుమ ముందుంటారు. ఆ కోవలోనే గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె యూట్యూబ్‌లో అడుగుపెట్టేశారు. బుల్లితెర మీద కనిపించే యాంకర్ సుమకు, ఈ యూట్యూబర్ సుమకు చాలా […]
దిశ, వెబ్‌డెస్క్:
తెలుగులో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఇష్టమైన యాంకర్ సుమ. మలయాళీ అయినప్పటికీ అచ్చుతప్పులు లేకుండా స్పష్టంగా తెలుగు ఉచ్ఛరిస్తూ, తన మాటల తూటాలతో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంలో సుమ ముందుంటారు. ఆ కోవలోనే గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె యూట్యూబ్‌లో అడుగుపెట్టేశారు. బుల్లితెర మీద కనిపించే యాంకర్ సుమకు, ఈ యూట్యూబర్ సుమకు చాలా తేడా ఉంది. సుమక్క అనే పేరుతోనే ఛానల్ ప్రారంభించి, అతి తక్కువ సమయంలోనే ఇంటర్నెట్ జనాలను కూడా తన శైలిలో ఆకట్టుకుంటోంది.
ఎపిసోడ్ల కొద్దీ కార్యక్రమాలు చేయడం, రోజుల తరబడి ఆడియో రిలీజులు, సినిమా ఈవెంట్లు చేయడం సుమక్క రోజువారీ పనిలో ప్రధాన భాగం. అయితే అన్ని కార్యక్రమాలను చేయడానికి అంత ఉత్సాహం ఎక్కడినుంచి వస్తుంది? ప్రోగ్రాముల వెనక ఎలాంటి కసరత్తు జరుగుతుంది? అనే తెర వెనక విషయాలన్నింటినీ సుమ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటి వరకు 32 వీడియోలు ఉన్న ఈ ఛానల్ త్వరలో నాలుగు లక్షల సబ్‌స్క్రైబర్‌లకు చేరువకాబోతోంది.
ఎలాంటి వీడియోలు?
ఇప్పటివరకు సుమక్క ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోల్లో ‘నా తిండి గురించి మీకు తెలుసా?’, ‘మేకప్ టు ప్యాకప్’ అనే వీడియోలకు మిలియన్‌కి పైగా వీక్షణలు వచ్చాయి. ఈ యూట్యూబ్ ఛానల్ యాంకర్‌గా తన ప్రస్థానాన్ని తెలియజేస్తూ పెట్టిన వీడియోలకు కూడా చాలా స్పందన వచ్చింది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా వంటలు చేయడం, పేదలకు సాయం చేయడం, ప్రేమికులకు సలహాలు సూచనలు ఇచ్చే వీడియోలను కూడా సుమక్క పోస్ట్ చేస్తున్నారు.
ఎలాంటి స్క్రిప్టు లేకుండానే టీవీ ప్రోగ్రామ్‌లను అదరగొట్టే సుమక్క, ఇక యూట్యూబ్ వీడియోల్లో తన ఎంటర్‌టైన్‌మెంట్ విశ్వరూపం చూపిస్తోంది. తన కంటెంట్‌తో యంగ్ యూట్యూబర్లకు గట్టిపోటీని ఇస్తున్న సుమక్క, త్వరలోనే పది లక్షల సబ్‌స్క్రైబర్లకు కూడా రీచ్ అవుతుందనడంలో అతిశయోక్తిలేదేమో!