ప్రెగ్నెన్సీతో యాడ్ షూటింగ్‌లో అనుష్క

దిశ, వెబ్‌డెస్క్: చివరగా 2018లో వచ్చిన ‘జీరో’ సినిమాలో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ .. ఆ తర్వాత నిర్మాతగా బిజీగా మారడంతో మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న తను నివియా యాడ్ షూట్ కోసం మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. పేల్ గ్రీన్ సింగిల్ షోల్డర్ గౌన్, బ్రౌన్ ఫ్లాట్ సాండల్స్‌తో పాటు ఫేస్ మాస్క్‌తో దర్శనమిచ్చిన అనుష్క.. చాలా రోజుల తర్వాత సెట్స్ మీదకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని […]

Update: 2020-11-22 03:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: చివరగా 2018లో వచ్చిన ‘జీరో’ సినిమాలో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ .. ఆ తర్వాత నిర్మాతగా బిజీగా మారడంతో మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న తను నివియా యాడ్ షూట్ కోసం మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. పేల్ గ్రీన్ సింగిల్ షోల్డర్ గౌన్, బ్రౌన్ ఫ్లాట్ సాండల్స్‌తో పాటు ఫేస్ మాస్క్‌తో దర్శనమిచ్చిన అనుష్క.. చాలా రోజుల తర్వాత సెట్స్ మీదకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ప్రెగ్నెన్సీతో ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది, ఆందోళన లేకుండా షూటింగ్‌లో పాల్గొన్న అనుష్క.. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో టీమ్ తీసుకున్న జాగ్రత్తలపై నమ్మకంతోనే యాడ్ షూటింగ్‌కు హాజరైనట్లు తెలిపింది. ముంబైలో వారం రోజులపాటు జరిగే యాడ్ చిత్రీకరణలో పాల్గొని బ్రాండ్ కమిట్‌మెంట్ పూర్తి చేయనుంది.

ఇన్నాళ్లు భర్త విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఆడుతుండగా.. తనకు కంపెనీ ఇచ్చేందుకు దుబాయిలో స్పెండ్ చేసిన అనుష్క ఈ మధ్యే ఇండియాకు తిరిగొచ్చింది. ఇక జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతుండగా.. హెల్త్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బిడ్డ పుట్టే సమయంలో కోహ్లీ పెటర్నిటి లీవ్ తీసుకోనున్నాడు. దీనికి బీసీసీఐ కూడా అనుమతించగా, తన నిర్ణయంపై పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఇక బిడ్డ పుట్టిన నాలుగు నెలల తర్వాత మళ్లీ బిజీ అయిపోనుంది అనుష్క. మే నుంచి న్యూ ప్రాజెక్ట్‌పై పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News