నా పిల్లలను రక్షించుకోలేకపోయా: అనుపమ

మలయాళీ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. పార్వో వైరస్ కారణంగా తన పెట్ డాగ్స్ చనిపోయాయని.. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు బేబీస్( టాడీ, రమ్)ను కోల్పోయామని బాధ పడింది. ‘మీరు మీ పెట్స్‌ను కోల్పోకముందే జాగ్రత్త పడాలని’ హెచ్చరించింది. పార్వో వైరస్ లక్షణాల గురించి తెలియకపోవడం వల్లే ఇదంతా జరిగిందని.. ఒక డాగ్ వల్ల మరో డాగ్‌కు వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపింది. ‘నా పిల్లలను […]

Update: 2020-06-17 01:45 GMT

మలయాళీ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. పార్వో వైరస్ కారణంగా తన పెట్ డాగ్స్ చనిపోయాయని.. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు బేబీస్( టాడీ, రమ్)ను కోల్పోయామని బాధ పడింది. ‘మీరు మీ పెట్స్‌ను కోల్పోకముందే జాగ్రత్త పడాలని’ హెచ్చరించింది. పార్వో వైరస్ లక్షణాల గురించి తెలియకపోవడం వల్లే ఇదంతా జరిగిందని.. ఒక డాగ్ వల్ల మరో డాగ్‌కు వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపింది. ‘నా పిల్లలను రక్షించుకోలేకపోయా.. మీకూ ఇలాంటి నష్టం జరగకూడదనే ఈ సలహా ఇస్తున్నాను. టీకాలు వేసిన కుక్క పిల్లలకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరమని’ చెప్పింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ వైరస్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేసింది అనుపమ. మీ పెట్ వల్ల మీకు ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఎదురయ్యే చాన్స్ లేదని స్పష్టం చేసింది.

‘మనియారాయిలే అశోకన్’ అనే మలయాళం చిత్రంతో పాటు ‘లీ పొదతే’ అనే తమిళ మూవీ చేస్తున్న అనుపమ.. తెలుగులో దిల్ రాజు మేనల్లుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ నటించనుంది.

Tags:    

Similar News