వివాదంలో మరో టీఆర్ఎస్ నేత.. లెక్కలు అడిగితే.. కులం పేరుతో
దిశ, భువనగిరి రూరల్ : దళిత ఉపసర్పంచ్ నైనా తనను అకారణంగా టీఆర్ఎస్ సర్పంచ్ భర్త కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని వలిగొండ మండల పరిధిలోని ఆరూర్ ఉప సర్పంచ్ చుక్క ముత్యాలు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రాఘవేందర్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సభలో అవినీతిపై ప్రశ్నించినందుకు, సర్పంచ్ భర్త చిట్టే డీ.జనార్దన్ రెడ్డి కులం పేరుతో దూషించడమే కాకుండా, తన అనుచరులతో కలిసి […]
దిశ, భువనగిరి రూరల్ : దళిత ఉపసర్పంచ్ నైనా తనను అకారణంగా టీఆర్ఎస్ సర్పంచ్ భర్త కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని వలిగొండ మండల పరిధిలోని ఆరూర్ ఉప సర్పంచ్ చుక్క ముత్యాలు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రాఘవేందర్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సభలో అవినీతిపై ప్రశ్నించినందుకు, సర్పంచ్ భర్త చిట్టే డీ.జనార్దన్ రెడ్డి కులం పేరుతో దూషించడమే కాకుండా, తన అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించాడాని ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. గ్రామంలో వీధిలైట్లలో 20 లక్షల అవినీతి జరిగిందని ప్రశ్నించడంతో సర్పంచ్ భర్త తన అనుచరులతో గ్రామ సభలోనే దాడికి ప్రయత్నించారని, ఒక దళితున్ని అయినందునే తనపై దాడి జరిగిందని, సర్పంచ్ భర్త తో పాటు వారి అనుచరులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.