ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. మరో విద్యార్థిని సూసైడ్
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని రిక్ష కాలనీకి చెందిన నందిని (17) విద్యార్థి జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. ఈ నెల 16న ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపంతో నందిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ […]
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని రిక్ష కాలనీకి చెందిన నందిని (17) విద్యార్థి జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. ఈ నెల 16న ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపంతో నందిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.
ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్, ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అయ్యారని ఆరోపించారు. వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత కళాశాలను తిరిగి ప్రారంభించారని.. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు పరీక్షలను సక్రమంగా రాయలేకపోయారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రప్రభుత్వం పరీక్షలు రాసిన సెకండీయర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశారు.