టీఎంసీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల నిష్క్రమణ కొనసాగుతున్నది. సీనియర్ నేత పార్టీ నుంచి వైదొలిగి 24 గంటలు గడవక ముందే మరో ఎమ్మెల్యే శిల్భద్ర దత్తా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు టీఎంసీ మైనార్టీ సెల్ నేత కబీరుల్ ఇస్లాం కూడా టీఎంసీకి రాజీనామా చేశారు. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేతల నిష్క్రమణ తృణమూల్ కాంగ్రెస్‌ను కలవర పెడుతున్నది. రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థుల […]

Update: 2020-12-18 10:20 GMT

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల నిష్క్రమణ కొనసాగుతున్నది. సీనియర్ నేత పార్టీ నుంచి వైదొలిగి 24 గంటలు గడవక ముందే మరో ఎమ్మెల్యే శిల్భద్ర దత్తా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు టీఎంసీ మైనార్టీ సెల్ నేత కబీరుల్ ఇస్లాం కూడా టీఎంసీకి రాజీనామా చేశారు. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేతల నిష్క్రమణ తృణమూల్ కాంగ్రెస్‌ను కలవర పెడుతున్నది.

రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ జోక్యం చేసుకుంటున్నారని, తన మాదిరిగా తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల శిల్భద్ర దత్తా తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి శువేందు అధికారి ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను స్పీకల్ బీమల్ బెనర్జీ తిరస్కరించారు. నిబంధనల ప్రకారం రాజీనామా లేఖ లేదని, స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేశారనుకోవడం లేదని, కాబట్టి సోమవారం తన ఎదుట హాజరు కావాలని శువేందు అధికారిని స్పీకర్ ఆదేశించారు.

Tags:    

Similar News