కాంగ్రెస్ నుంచి మరో నేత సస్పెండ్
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నేతను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన రావిర్యాల సభలో పాసుల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ఠాగూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత నిరంజన్, సత్యనారాయణరెడ్డికి రెండు రోజుల కిందట […]
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నేతను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన రావిర్యాల సభలో పాసుల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ఠాగూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత నిరంజన్, సత్యనారాయణరెడ్డికి రెండు రోజుల కిందట నోటీసులిచ్చారు. సోమవారం జరిగిన క్రమశిక్షణా సంఘం సమావేశానికి నిరంజన్ హాజరై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సత్యనారాయణరెడ్డి హాజరు కాలేదు. కానీ ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనపై సస్పెండ్ వేటు వేశారు. నిరంజన్‌కు మరో నోటీసు జారీ చేశారు.