థింక్ డిఫరెంట్.. ‘కాగితపు చాయ్’కు అదిరిపోయిన రెస్పాన్స్

దిశ, ఆదిలాబాద్ : మారుతున్న కాలానికి అనుగుణంగా రకరకాల చాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇరానీ చాయ్, కుండ చాయ్, లెమన్, హనీ ఇలా ఎన్నో రకాల చాయ్‌లను రుచిచూసాం. కానీ ఓ వ్యక్తి అందుకు భిన్నంగా చాయ్ తయారు చేస్తున్నాడు. పేపర్ను డొల్లగా మలిచి అందులో పాలు, పంచదార, పత్తి వేసి డొల్లను నిప్పులపై పెట్టి నోటితో ఊదుతూ 5 నిమిషాల్లో చాయ్ రెడీ చేసి ఇస్తున్నాడు. అదెక్కడో తెలుసుకోవాలని ఉందా అయితే ఆదిలాబాదుకు రావాల్సిందే. అదిలాబాద్ […]

Update: 2021-06-06 05:57 GMT

దిశ, ఆదిలాబాద్ : మారుతున్న కాలానికి అనుగుణంగా రకరకాల చాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇరానీ చాయ్, కుండ చాయ్, లెమన్, హనీ ఇలా ఎన్నో రకాల చాయ్‌లను రుచిచూసాం. కానీ ఓ వ్యక్తి అందుకు భిన్నంగా చాయ్ తయారు చేస్తున్నాడు. పేపర్ను డొల్లగా మలిచి అందులో పాలు, పంచదార, పత్తి వేసి డొల్లను నిప్పులపై పెట్టి నోటితో ఊదుతూ 5 నిమిషాల్లో చాయ్ రెడీ చేసి ఇస్తున్నాడు. అదెక్కడో తెలుసుకోవాలని ఉందా అయితే ఆదిలాబాదుకు రావాల్సిందే.

అదిలాబాద్ జిల్లా రూరల్ మండలం చాందా (టీ) గ్రామానికి చెందిన అన్ను బాయ్ రెండు దశాబ్దాలుగా టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. అందరిలా కాకుండా భిన్నంగా ఉండాలన్నదే ఆయన స్టైల్.. పూర్వీకులు మోదుగ ఆకులతో డొల్లను తయారు చేసి అందులో చాయ్ చేసుకునేవారట.. వారిని స్ఫూర్తిగా తీసుకుని అన్ను భాయ్ పేపర్ లో చాయ్ చేయాలనుకున్నాడు.అందుకోసం ఓ న్యూస్ పేపర్‌ను తీసుకొని దాన్ని డొల్లగా మలిచి అందులో పాలు, చక్కెర, పత్తి వేసి ఒకటి రెండు సార్లు ప్రయోగం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు అన్ను బాయ్ పేపర్ చాయ్ అంటే జిల్లాలో తెలియని వారుండరు. చాందా గ్రామానికి ఎవరైనా బంధువులు వచ్చినా ముందుగా అన్నుబాయ్‌ని కలిసి చాయ్ తాగిన తర్వాత బంధువుల ఇళ్లకు వెళ్తారు. ఇలా ఆ ఊరు అని తేడా లేకుండా ఏ గ్రామానికి వెళ్లినా ప్రతిఒక్కరూ అక్కడ ఆగి టీ తాగి వెళ్తుండటం విశేషం. పేపర్ చాయ్ చేయడం బ్రహ్మ విద్య కాదు అంటున్నాడు అన్ను భాయ్.. ముందుగా కొలిమిలో బొగ్గులు వేసి నిప్పంటించాలి. ఆ తర్వాత కాగితంతో తయారు చేసిన డొల్లలో చక్కెర, పాలు, పత్తి వేసి కొలిమిపై పెట్టాలి. నోటితో ఊదుతూ కాగితానికి నిప్పు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా ఎవరైనా 5 నిమిషాల్లో వేడి వేడి చాయ్ తయారు చేయవచ్చు అంటున్నాడు అన్ను భాయ్.

Tags:    

Similar News