కన్నుల పండుగగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం.
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు కన్నుల పండుగగా అశేష భక్త జనుల జైశ్రీరామ్ నినాదాలతో జరిగింది. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా ప్రభావం కారణంగా భక్తుల హాజరు తక్కువగా ఉన్న ఈ సంవత్సరం ఎలాంటి నిబంధన లేకపోవడం వల్ల రథోత్సవంలో సుమారు 50 నుండి అరవై వేల మంది భక్తులు హాజరై రథోత్సవంలో తిలకించి నట్టు సమాచారం. ఈ రథోత్సవం లో మక్తల్ […]
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు కన్నుల పండుగగా అశేష భక్త జనుల జైశ్రీరామ్ నినాదాలతో జరిగింది. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా ప్రభావం కారణంగా భక్తుల హాజరు తక్కువగా ఉన్న ఈ సంవత్సరం ఎలాంటి నిబంధన లేకపోవడం వల్ల రథోత్సవంలో సుమారు 50 నుండి అరవై వేల మంది భక్తులు హాజరై రథోత్సవంలో తిలకించి నట్టు సమాచారం.
ఈ రథోత్సవం లో మక్తల్ సిఐ శంకర్, ఏడుగురు ఎస్సైలు 70 మంది కానిస్టేబుళ్లు, పదిమంది స్పెషల్ ఫోర్స్ సిబ్బంది తో ఆంజనేయ స్వామి రథోత్సవం విజయవంతంగా బందోబస్తు నిర్వహించారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా రథోత్సవం ముగిసింది.