అడవి జంతువులకూ తప్పని కరోనా కష్టాలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గడగడ వణికిపోతున్నాయి. రోగం వచ్చాక సంగతి పక్కన పెడితే ఈ వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రపంచదేశాలు దృష్టిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలోని రువాండా, ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగో దేశాలు అడవి జంతువుల మీద కన్నేశాయి. గొరిల్లాలకు కరోనా సోకితే చాలా కష్టమవుతుందేమోనని ముందు జాగ్రత్తతో అడవుల లాక్‌డౌన్ విధించారు. దాదాపు మనుషుల జన్యువులకు దగ్గర ఉన్నా కోతి జాతి జంతువులకు కరోనా […]

Update: 2020-04-12 03:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గడగడ వణికిపోతున్నాయి. రోగం వచ్చాక సంగతి పక్కన పెడితే ఈ వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రపంచదేశాలు దృష్టిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలోని రువాండా, ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగో దేశాలు అడవి జంతువుల మీద కన్నేశాయి. గొరిల్లాలకు కరోనా సోకితే చాలా కష్టమవుతుందేమోనని ముందు జాగ్రత్తతో అడవుల లాక్‌డౌన్ విధించారు. దాదాపు మనుషుల జన్యువులకు దగ్గర ఉన్నా కోతి జాతి జంతువులకు కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి.

గతంలో మానవుల నుంచి సాధారణ జలుబు, ఎబోలా వంటి జబ్బులు కోతులు, కొండంగులు, గొరిల్లాలు, చింపాంజీలు, ఒరంగుటాన్లకు వ్యాపించాయి. ఆ సమయంలో దాదాపు వేల సంఖ్యలో చింపాంజీలు, గొరిల్లాలు చనిపోయాయి. ఇక కరోనా లాంటి వైరస్ వాటికి సోకితే తీవ్ర నష్టం జరుగుతుందని వన్యప్రాణ సంరరక్షులు కంగారు పడ్డారు. వాటిని కూడా లాక్‌డౌన్ చేయడం వల్ల కొంత ఐసోలేట్ చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.

Tags: Lockdown, Gorillas, Chimpanzees, Home Quarantine, Forest, Africa

Tags:    

Similar News