నువ్వు మేస్తుండూ.. నేను చూస్తుంటా..!
దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో రక్త సంబంధీకులే బద్దశత్రువులుగా మారి హత్యలు చేసుకుంటున్నారు. ప్రాణ స్పేతులు సైతం చిన్నచిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ రెండు వేర్వేరు జాతులకు చెందిన జంతువులు ఎలా కలిసిమెలిసి జీవిస్తున్నాయో చూస్తే మనుషులకు కనువిప్పు కలగక మానదు. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం యాడారం గ్రామ శివారులోని మైసమ్మ చెరువు సమీపంలో గేదెపై ఓ శునకం ఎక్కి కూర్చుంది. అయినా గేదె దానిని ఏమనకపోగా.. గంటల తరబడి తనపై ఎక్కించుకోని […]
దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో రక్త సంబంధీకులే బద్దశత్రువులుగా మారి హత్యలు చేసుకుంటున్నారు. ప్రాణ స్పేతులు సైతం చిన్నచిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ రెండు వేర్వేరు జాతులకు చెందిన జంతువులు ఎలా కలిసిమెలిసి జీవిస్తున్నాయో చూస్తే మనుషులకు కనువిప్పు కలగక మానదు. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం యాడారం గ్రామ శివారులోని మైసమ్మ చెరువు సమీపంలో గేదెపై ఓ శునకం ఎక్కి కూర్చుంది. అయినా గేదె దానిని ఏమనకపోగా.. గంటల తరబడి తనపై ఎక్కించుకోని పచ్చిగడ్డి మేసింది. కుక్క మాత్రం దానికి బాడీగార్డుగా దిక్కులు చూస్తూ కాపలా కాసింది. ఈ దృష్యాన్ని చూసిన బాటసారులు ఔరా.. స్నేహమంటే ఇదేరా.. అనుకోవడం వినిపించింది. ఈ చిత్రాన్ని క్యాతం రవి అనే ఔత్సాహికుడు తన సెల్ కెమెరాలో బంధించాడు.