YS Viveka Murder Case: హత్య కేసు తీర్పు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును...Ys Vivekananda Reddy Case Investigation Supreme Court
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని.. వేరే రాష్ట్రం నుంచి దర్యాప్తు జరిపించాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్టోబర్ 19న ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్నాలని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. నవంబర్ 21న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
అయితే సోమవారం ధర్మాసనం తీర్పును మరో వారంపాటు వాయిదా వేసింది. ఇదే కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్ రద్దు విషయం కూడా హత్య కేసు దర్యాప్తు బదిలీతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విచారణ కూడా అదే రోజు చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఇకపోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు విషయంలో తనయ వైఎస్ సునీతారెడ్డి మెుదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా తన తండ్రి హత్యా కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అందుకు అంగీకరించింది. అయితే ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలన్నదానిపై తీర్పును మాత్రం మరో వారం రోజులపాటు వాయిదా వేసింది.
Read more: