‘ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి’..రాష్ట్ర మంత్రి ఆదేశం

ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి, స్మగ్లింగ్‌ను అరికట్టాలని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరారు.

Update: 2024-07-16 15:22 GMT

దిశ ప్రతినిధి,కడప:ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి, స్మగ్లింగ్‌ను అరికట్టాలని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరారు. మంగళవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులు పోలీసు వ్యవస్థ గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిత్తూరు కడప జిల్లాలో నేరాలను అదుపు చేయడం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.


Similar News