రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి: Mp Avinash Reddy
కడప జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి కోరుకున్నారు...
దిశ, కడప: కడప జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మవారి దేవెనెలతో మరిన్ని పథకాలు అమలు చేయలని కోరుకున్నట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కడప వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు సంవృద్దిగా కురిసి, చెరువులు ప్రాజెక్టులు నిండి రైతులు సుభిక్షంగా ఉండాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అమ్మవారి దీవెనెలు మెండుగా ఉండాలని, అమ్మవారి దయ వల్ల రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమాభివృద్ది పథకాలు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు.