Proddatur: కూతురికి ప్రేమ పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే రాచమల్లు
కడప జిల్లా ప్రొద్దుటూరులో కూతురికి ఎమ్మెల్యే రాచమల్లు దగ్గరుండి ప్రేమ పెళ్లి జరిపించారు...
దిశ, డైనమిక్ బ్యూరో: కూతురు ఏ అబ్బాయినైనా ప్రేమించిందని తెలిస్తే తల్లిదండ్రులు వెంటనే కుతూరుకి వేరే అతనితో త్వరగా పెళ్లి చేయడం చేస్తుంటారు. లేదా చదువుతున్న కాలేజీ మాన్పించడం చేస్తుంటారు. కొందరైతే ప్రేమించిన అబ్బాయిని చంపిన ఘటనలు ఉన్నాయి. కానీ అందుకు భిన్నంగా కూతురు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేయడం అరుదుగా జరుగుతుంటాయి. ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. చదువుకునే రోజుల్లో పవన్ అనే యువకుడిని ఆమె ప్రేమించిందని, డబ్బు, కులానికి విలువ ఇవ్వకుండా పెళ్లి చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బొల్లవరంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఎమ్మెల్యేపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.