Breaking: అంబులెన్స్‌లో అవినాశ్ రెడ్డి.. హైదరాబాద్‌కు పయనం

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మని పరామర్శించారు...

Update: 2023-05-19 10:51 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మని కర్నూలు జిల్లా తాడిపత్రిలో పరామర్శించారు. ఉదయం అవినాశ్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరుకాకుండా హుటాహుటిన తాడిపత్రికి బయల్దేరి వెళ్లారు. అయితే తన తల్లికి మెరుగైన వైద్యం చేయించేందుకు తాడిపత్రి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఆమె తీసుకొస్తున్న అంబులెన్స్‌లోనే అవినాశ్ రెడ్డి కూడా హైదరాబాద్‌కు పయనం అయ్యారు.

అయితే అంతకుముందు హైడ్రామా నెలకొంది. వివేకానందారెడ్డి హత్య కేసులో హైదరాబాద్ సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే తల్లి లక్ష్మమ్మకి అనారోగ్యం కారణంగా ఆయన విచారణకు హాజరుకాలేదు. అంతేకాదు హైదరాబాద్ నుంచి తాడిపత్రికి బయల్దేరారు. దీంతో అవినాశ్ రెడ్డి కారును సీబీఐ అధికారులు కర్నూలు వరకు ఫాలో చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ హైడ్రామాతో ఎంపీ అవినాశ్ రెడ్డి పారిపోతున్నారని ప్రచారం జరిగింది.

Read more:

Viveka Case: అవినాశ్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

Tags:    

Similar News