Kadapa: రైతులకు గుడ్ న్యూస్... ఆరు తడి పంటలకు నీరు విడుదల

కేసీ కెనాల్ కింద ఉన్న ఆరు తడి పంటలకు ఇరిగేషన్ అధికారులు కొద్దిపాటి నీటిని విడుదల చేశారు. ..

Update: 2023-10-10 14:15 GMT

దిశ, కడప: కేసీ కెనాల్ కింద ఆరు తడి పంటలకు ఇరిగేషన్ అధికారులు కొద్దిపాటి నీటిని విడుదల చేశారు. కడప- కర్నూలు కాలువగా పిలిచే కేసీ కాలవ కింద జిల్లాలో 1,30,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో 95, 000 ఎకరాలు స్థిరంగా పంటలు సాగు చేస్తున్నారు. కేసీ కెనాలకు నీళ్లు రాకపోవడంతో పంటలు సాగు చేయలేకపోయారు. ప్రధానంగా ఈ కాలువ కింద వరి పంట సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది నీరు రానికారణంగా ‌సుమారు 55 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేసుకున్నారు. ఈ రైతులకైనా ప్రయోజనం కలిగే విధంగా కేసీ కాలువకు రాజోలు ఆనకట్ట వద్ద నుంచి 400 క్యూసెక్కులు మళ్ళించారు. నీటి పరిమాణాన్ని మరికొంత పెంచనున్నారు. పది రోజులపాటు ఈ వీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈలోపు వర్షాలు పడితే ఆరు తడి పంటలతో పాటు బోరు బావుల ద్వారా సాగు చేసిన వరి పంటలు కూడా గట్టెక్కే అవకాశం ఉంటుందని అధికారులు, రైతులు అంచనా వేస్తున్నారు.


Similar News