మెగా డీఎస్సీ విడుదల చేయాలని పోరాడితే అక్రమ అరెస్టులా?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డిని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని డీసీసీ అధ్యక్షుడు షేక్ అల్లాబక్షు అన్నారు.
దిశ,రాయచోటి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డిని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని డీసీసీ అధ్యక్షుడు షేక్ అల్లాబక్షు అన్నారు. దగా డీఎస్సీ వద్దు మేఘ డీఎస్సీ విడుదల చేయాలని కోరుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ నాయకులు పోరాడుతుంటే అక్కడికక్కడే అక్రమ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలు త్వరలో భూస్థాపితమవుతాయని ఆయన జోష్యం చెప్పారు.శుక్రవారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 26న జిల్లా కేంద్రం అనంతపురం లోని జూనియర్ కళాశాలలో జరుగు న్యాయ నిర్మాణ సభను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, కాంగ్రెస్ ప్రజానీకానికి ఆయన పిలుపునిచ్చారు.
ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ముఖ్య అతిథులుగా, ప్రత్యేక హితులుగా సీడబ్ల్యూసీ గౌరవ సభ్యులు డాక్టర్ రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ హాజరవుతున్నారని చెప్పారు.అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాల,పట్టణ, మండలాల నాయకులు తమ బృందాలతో భారీ స్థాయిలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు దర్బార్ బాష, జిల్లా జనరల్ సెక్రెటరీ పటాన్ మహమ్మద్ అలీ ఖాన్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు అమీర్ భాష, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ, పట్టణ అధ్యక్షుడు ఖాదర్ ఖాన్, మండల అధ్యక్షుడు జాఫర్ , నూరుల్లా, వెంకటసుబ్బయ్య, ఇతరులు పాల్గొన్నారు.