Kadapa: రైలు కిందపడి యువ దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు నిండు కుటుంబాన్ని నిలువునా ముంచివేసింది..
దిశ, కడప: ఆర్థిక ఇబ్బందులు నిండు కుటుంబాన్ని నిలువునా ముంచివేసింది. రెండు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ మహిళ విధిని ఎదిరించలేక తనువు చాలించింది.. పరువు పోగొట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, తన కుటుంబానికి జరిగిన మోసాలకు బలై చివరగా రైలు కిందపడి ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిసి వేసింది. కడప నగర పరిధి చెన్నూరు మండలం రామనపల్లెలో నివసించే నివసించే సాయికుమార్ రెడ్డి (33), హేమమాలిని (28)కి 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు.
అయితే వీరికి చెందిన భూమిని వేరే వారికి తాకట్టు పెట్టారు. అంతేకాకుండా సేల్ రిజిస్ట్రేషన్ సైతం చేయించారు. అటు ఆ భూమిని సైతం పొందలేకపోయారు. వీటితో పాటు ఇతర ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని పూర్తిగా ఇబ్బందులు పెట్టారు. దీంతో గర్భిణిగా ఉన్న భార్య హేమామాలినితో పాటు భర్త సాయికుమార్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. కడప నగర శివారు ప్రాంతం కనుల్లోపల్లె సమీపంలో రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై రారాజు ఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ మృతదేహాలను రిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు.