Kadapa: పోలీసు స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య
వైయస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ విజయరాముడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ..
దిశ, కడప: వైయస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ విజయరాముడు (39) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేకెత్తించింది. డ్యూటీలో ఉన్న విజయరాముడు పోలీస్ స్టేషన్లో ఓ మూలన ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన తోటి పోలీసులు వెంటనే విజయరాముడుని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. విజయరాముడు ఆత్మహత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పోలీసు అధికారులు ఎటువంటి సమాచారం వెల్లడించడంలేదు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.