కమలాపురంపై Cm Jagan ప్రత్యేక దృష్టి.. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నామన్నారు...

Update: 2022-12-23 11:15 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయని గుర్తు చేశారు. కమలాపురానికి గాలేరు-నగరిని తీసుకువచ్చేందుకు వైఎస్ ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్‌ఆర్ దయతో కడప జిల్లాలో ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు. కృష్ణా నది కడప జిల్లాకు వచ్చిందంటే అందుకు వైఎస్సారే కారణమని జగన్ అన్నారు. గతంలో ఎవరూ ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. బ్రహ్మసాగర్‌కు రూ. 550 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. చిత్రావతిలో 10 టీఎంసీలు, గండి కోటలో 27 టీఎంసీల నీళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆగిన సాగు నీటి ప్రాజెక్టులను కొనసాగిస్తున్నామని జగన్ తెలిపారు. ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తి అయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అందరికి ఉద్యోగాలు రావాలన్న తపనతో ముందడుగు వేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ALSO READ : 

1.Somu Veerraju: సొమ్ములు మావి..సోకులు మీవా?

2.Ys Jagan నిన్ను జైల్లో వేయలేమా?

Tags:    

Similar News