Kadapa: జగన్ ఇలాకలో చెలరేగిన అసమ్మతి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నేతల మధ్య అసమ్మతి రాజుకుంది. ..
దిశ, ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నేతల మధ్య అసమ్మతి రాజుకుంది. బద్వేల్ నియోజకవర్గంలో అసమ్మతి నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డితో కలిసి పని చేయలేమని తేల్చి చెప్పారు. కొంతకాలంగా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఆయన తమ్ముడు, బావమరుదుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సోదరుడు కాశినాయన జడ్పిటిసి సత్యనారాయణ రెడ్డి, బావమరిది విశ్వనాథరెడ్డి అసమ్మతి సమావేశం నిర్వహించారు.
అయితే ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తీరుతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉండే అభిమానంతో వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడటం లేదన్నారు. కొంతకాలంగా ఎమ్మెల్సీ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.