Kadapa: విజయవాడ ఘటన మరువక ముందే మరో ప్రమాదం..

విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సాన్ని మర్చిపోక ముందే మరో ఘటన భయాందోళన కలిగింది..

Update: 2023-11-07 12:42 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సాన్ని మర్చిపోక ముందే మరో ఘటన భయాందోళన కలిగించింది. విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ప్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తాజాగా కడపలో ఆర్టీసీ అద్డె బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కడపకు బయల్దేరింది. అన్ని ఊర్లు దాటి కడప నగరంలోకి ఎంటర్ అయింది. అలా కడప సంధ్యా జంక్షన్ వద్దకు రాగానే బస్సు బ్రేక్ సరిగా పని చేయలేదు. దాంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. నడిరోడ్డుపై బస్సు ఆపితే సమస్య వస్తుందని, చిన్నగా బస్సును కడప బస్టాండ్ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. అయితే బస్సును ఆపుతుండగా బ్రేక్ పూర్తిగా పని చేయలేదు. దీంతో ఎదురుగా బైక్‌లపై కూర్చుని మాట్లాడుకుంటున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాల్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఆర్టీసీ ఆధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరో డ్రైవర్‌తో బస్సును చెక్ చేయించారు. అయితే బస్సు బ్రేక్ సరిగా పని చేయలేదని నిర్ధారణ అయింది.

మరోవైపు వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాలం చెల్లిన బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బటన్ నొక్కి డబ్బులు వేసే జగన్‌కు బస్సు ప్రమాదాల్లో పోతున్న ప్రాణాలు కనిపించవా అని ప్రశ్నిస్తున్నారు.


Similar News