Breaking: కడప జిల్లాలో పేలుడు.. ఏడుగురికి గాయాలు

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో పేలుడు కలకలం రేగింది....

Update: 2023-03-01 12:55 GMT
Breaking: కడప జిల్లాలో పేలుడు.. ఏడుగురికి గాయాలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో పేలుడు కలకలం రేగింది. తుక్కుగోదాంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బా పేలడంతో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. పాత వస్తువులను వేరు చేస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

Tags:    

Similar News