ఇది వాటర్ ట్యాంకా.. పాముల ట్యాంకా.. స్నానానికి వెళ్లిన వ్యక్తికి ఎదురైన భయనక ఘటన (వీడియో)

సాధారణంగా ఒక్కపామును చూస్తేనే గుండె ఝల్లమంటుంది.

Update: 2024-05-27 15:57 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఒక్కపామును చూస్తేనే గుండె ఝల్లమంటుంది. భయంతో ఆమడ దూరం పరుగులు పెడతాము. మరి ఒకే సారి 30 పాములు కంటపడితే ఏంటీ పరిస్థితి.. ఆ దరిదాపుల్లో కూడా కనిపించకుండా పరుగులు పెడతాము. తాజాగా ఇలాంటి సంఘటనే అస్సాంలో జరిగింది. నాగావోస్ జిల్లాలోని జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్‌రూమ్ వెళ్లాడు. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు. వెంటనే భయందోళనకు గురైన ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు. స్థానికంగా పాముల్ని పట్టే సంజీబ్ దేకా అనే అతడికి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ అక్కడి నెంచి తరలించారు. కాగా.. అన్నీ బురదపాములో కావడంతో అందరూ ఊరిపి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నట్టింట వైరల్‌గా మారింది.  

(Credit goes to NDTV Instagram account)


Similar News