నేను గన్‌తో ఎవరినీ బెదిరించలేదు: వైసీపీ నేత మురళి

తాను ఎవరినీ గన్‌తో బెదిరించలేదని వైసీపీ నేత కందిగోపుల మురళి అన్నారు...

Update: 2024-08-21 14:42 GMT

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసయమంలో ఆయన గన్‌తో హల్ చల్ చేశారు. దీంతో మురళిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులపై ఆయన స్పందించారు. తనపై దాడి చేస్తారనే భయంతో తుపాకీ బయటకు తీశానని మురళి తెలిపారు. తాను గన్‌తో ఎవరినీ భయ పెట్ట లేదన్నారు. తన ఇంటిపై దాడి జరిగితే రివర్స్‌లో కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద లైసెన్స్ తుపాకులు ఉన్నాయని, తానెవరినీ బెదిరించలేదన్నారు. గతంలో తాను టీడీపీలో పని చేసి సర్వం పోగొట్టుకున్నానని తెలిపారు. వైసీపీలో చేరినప్పటి నుంచి తనపై టీడీపీ నాయకులు కక్ష గట్టారన్నారు. తన ఇంటిపై జరిగిన దాడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేస్తే శిక్షించొచ్చని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో తాముంటే అక్రమంగా కేసులు పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని మురళి మండిపడ్డారు.


Similar News