Breaking: వైఎస్ షర్మిలతో వైఎస్ సునీత భేటీ..ఆ నియోజకవర్గం నుండి పోటీ..

ఈ రోజు కడప పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

Update: 2024-01-29 07:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు కడప పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ నేపధ్యంలో కడప లోని యుడుపులపాయలో వైఎస్ ఆర్ ఘాట్ దగ్గర తండ్రి సమాధికి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. అలానే తన సోదరి వైఎస్ సునీత రెడ్డితో కలిసి తండ్రి సమాధి వద్ద వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ షర్మిలతో వైఎస్ సునీత యుడుపులపాయ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు.

చాల సమయం సోదరీమణులు ఇరువురు ముచ్చటిచుకున్నారు. కాగా వైఎస్ షర్మిలతో ఆమె సోదరి వైఎస్ సునీత భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుపున కడప ఎంపీగా వైఎస్ సునీత పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఏపీసీసీ చీఫ్ తో భేటీ కావడం జరుగుతున్న ప్రచారానికి జీవం పోసిందని.. వైఎస్ సునీత కడప ఎంపీ గా పోటీ చేసే అవకాశం నూటికినూరుపాళ్ళు ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అయితే గత కొంత కాలంగా వైఎస్ ఆర్ కుటుంబానికి దూరంగా ఉన్న వైఎస్ సునీత.. ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో షర్మిలతో సునీత భేటీ కావడం కడప జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈ రోజు కడపలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు వైఎస్ సునీత హాజరుకానున్నారు.

అంటే ఆమె దాదాపు కాంగ్రెస్ గూటికి చేరినట్లే అని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పులివెందుల బరిలో ఎటు చూసిన వైఎస్ కుటుంబ సభ్యులు మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో కడపలో కాగ్రెస్ పార్టీ ఊపందుకుంది. ఇక వైఎస్ సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు సోదరి షర్మిల వ్యూహ రచన చేస్తోందని సమాచారం. 

Tags:    

Similar News