AP:గుడ్లవల్లేరు ఘటనపై వైఎస్ షర్మిల షాక్..ఆడబిడ్డ తల్లిగా భయపడ్డా అంటూ సంచలన ట్వీట్

ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్దినుల బాత్ రూమ్‌ల్లో రహస్య కెమెరా పెట్టి 300 వీడియోలు తీసి అమ్ముకున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2024-08-30 08:08 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్దినుల బాత్ రూమ్‌ల్లో రహస్య కెమెరా పెట్టి 300 వీడియోలు తీసి అమ్ముకున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంతో రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు.

ఫాస్ట్రాక్ విచారణ జరిపి, కమిటీ వేయాలని మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాత్రూమ్ వీడియోలు బ్లాక్ చేయాలన్నారు. విద్యార్థినుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని షర్మిల వ్యాఖ్యానించారు. బాత్ రూమ్‌లో రికార్డు అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తానని హెచ్చరించారు. విద్యార్థినిలతో మాట్లాడుతానని, వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని షర్మిల పేర్కొన్నారు.


Similar News