ఆంధ్రప్రదేశ్ PCC చీఫ్‌గా వైఎస్ షర్మిల.. ఆరోజే అధికారిక ప్రకటన?
తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏపీపై కన్నేసింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏపీపై కన్నేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 27న ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనుంది. అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఏపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన వెలువనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో గతంలో షర్మిల చర్చలు జరిపారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే, ఆమె సేవలను అధిష్టానం ఏపీలో వాడుకోవాలని చూడగా.. షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. ఏపీలో వైఎస్‌ఆర్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలు పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది.
Read More : ముందు ఆంధ్రప్రదేశ్ స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయండి.. వైసీపీకి టీడీపీ కౌంటర్