AP News:కూటమి ప్రభుత్వం పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఏకతాటిపైకి రావడంతో సీఎం చంద్రబాబు తలవంచక తప్పలేదని మాజీ సీఎం జగన్ అన్నారు.
దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ ఏకతాటిపైకి రావడంతో సీఎం చంద్రబాబు తలవంచక తప్పలేదని మాజీ సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోవడంతో చంద్రబాబు కొనుగోలుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. యలమంచిలి ప్రజాప్రతినిధులతో సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాట్లాడారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులంతా విలువలు, విశ్వసనీయత వైపు నిలబడ్డారని అన్నారు. తాను అధికారంలో ఉంటే ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందేవని చెప్పారు. కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా 99 శాతం హామీలు నేరవేర్చామని వైఎస్ జగన్ అన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రతి ఇంట్లో కనబడుగోందన్నారు. అందుకే వైసీపీ లోని ప్రతి కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతున్నాడని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసేందుకు సాకులు వెతుక్కొలేదు. విలువలతో రాజకీయాలు చేశాం అన్నారు. టీడీపీ అబద్ధపు హామీలకు జనం మోసపోయారు. రెండున్నర నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం చంద్రబాబుదే అని తెలిపారు.