AP News:సీఎం చంద్రబాబు పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది.

Update: 2024-08-08 13:16 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును ప్రజలే నామరూపాల్లేకుండా చేస్తారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గురువారం నర్సీపట్నం నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్కూళ్లు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఇంటి గడప వద్దకే మనం సేవలందిస్తే..ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది అని వైఎస్ జగన్ అన్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని వ్యాఖ్యానించారు. మీ జగన్ సీఎంగా ఉండుంటే..క్యాలెండర్ ప్రకారం పథకాలు వచ్చేవి అని పేర్కొన్నారు.

Tags:    

Similar News