Breaking: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది...

Update: 2023-06-06 12:36 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్ ఉమామహేశ్వర్ రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. ఇక ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వైఎస్ సునీత కూడా వాదనలు వినిపించారు. అయితే రాతపూర్వక వాదనలు ఇవ్వాలని ఆమె తరపు లాయర్‌కు ధర్మాసనం సూచించింది. ఇరువర్గాల వాదనలను పరిశీలించిన కోర్టు విచారణను ఈ 9కి వాయిదా వేసింది.

ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని గత విచారణలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో 15 రోజులకు పైగా చంచల్ గూడ జైల్లో ఉన్నానని.. తన అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని వైఎస్ భాస్కర్ రెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ నెల 9న జరిగే విచారణలో ఏం జరుగుతుందో చూడాలి. 

Tags:    

Similar News