YCP MLA Kotamreddy Sridhar Reddy: జగన్ మీద అభిమానంతోనే ఇన్నాళ్లు భరించా

వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-01 04:58 GMT
YCP MLA Kotamreddy Sridhar Reddy:  జగన్ మీద అభిమానంతోనే ఇన్నాళ్లు భరించా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత మొదటిసారి బుధవారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విధేయుడిని అని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన వేసుకొని కష్టపడ్డానని ఆవేదన చెప్పారు. పార్టీ ఎదిగాక, జగన్ సీఎం అయ్యాక గుర్తింపు కోరుకోవడం తప్పా అని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనుల విషయంలో అనేకసార్లు అధికారులను ప్రశ్నించానని అన్నారు. ప్రజలకూ విధేయుడిగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ గురించి, పార్టీ గురించి ఎప్పుడూ తప్పుడు కామెంట్లు చేయలేదని తెలిపారు. గతేడాది ఆగస్టు నెల నుంచి నిధుల కోసం పోరాటం చేస్తున్నానని వాపోయారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీ విధేయుడిగా పనిచేసినా తనను అనుమానిస్తుననారని, కేవలం జగన్ మీద ఉన్న అభిమానంతోనే ఇవాళ్లు అవమానాలన్నీ భరించారని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గడపగడప కంటే ముందే తాను కార్యకర్తల దగ్గరకు వెళ్లానని చెప్పుకొచ్చారు. ఒక ఎమ్మెల్యేగా కార్యకర్తల కష్టం ఏంటో తనకు తెలుసని అన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆవేదన చెందారు. ఫోన్ ట్యాపింగ్ విషయమై ఓ ఐఏఎస్ తనకు చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశానని అన్నారు. తనకు పార్టీలో ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదని తెలిపారు

Also Read...

బ్రేకింగ్: CM జగన్‌కు ఎంపీ రఘురామరాజు ఊహించని షాక్..! 

Tags:    

Similar News