AP News:వైసీపీ ఎంపీ కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ?

విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద నిర్మించిన కాంక్రీట్ ప్రహారీ గోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమారై నేహా రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

Update: 2024-07-30 11:58 GMT

దిశ,వెబ్‌డెస్క్:విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద నిర్మించిన కాంక్రీట్ ప్రహారీ గోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమారై నేహా రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని సింగిల్ జడ్జి స్పష్టం చేశారు.


Similar News